Russia Submarine: రష్యా చేతికి అణు సునామీ, ‘బెల్గోరోడ్’ జలాంతర్గామి

ప్రపంచ నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కృతమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉండగలదు. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీలా ప్రయోగించగలదు. అదే ‘కే–329 బెల్గోరోడ్’ జలాంతర్గామి. దీని రాకతో సముద్రంపై జరిగే యుద్ధాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల రష్యాకు అత్యంత కీలకమైన కోలా ద్వీపకల్పానికి సమీపంలోని తెల్ల సముద్రంలో సెవెరోడిన్స్క్‌లో రష్యా అమ్ములపొదిలోకి చేరింది. 604 అడుగుల పొడవుతో ఉన్న ఈ సబ్‌మెరైన్.. ప్రపంచంలోనే భారీ జలాంతర్గామిగా నిపుణులు చెబుతున్నారు. గతంలో రష్యా నిర్మించిన ఆస్కార్ శ్రేణి సబ్‌మెరైన్ పొడవును పెంచి అణు టార్పిడో పొసైడాన్ను ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
