నవంబర్ 2018 అంతర్జాతీయం
Sakshi Education
జీ-20 సదస్సులో పాల్గొననున్న మోదీ
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. నవంబర్ 30, డిశంబర్ 1 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మోదీ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ముగ్గురు దేశాధినేతలు చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : నవంబర్ 30, డిశంబర్ 1
ఎక్కడ : బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
పాకిస్థాన్‌లో ‘కర్తార్‌పూర్’కు శంకుస్థాపన
సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్థాన్‌లో పంజాబ్‌లోని నరోవాల్ జిల్లా శాఖర్‌గఢ్ వద్ద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 28న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లడుతూ... పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. భారత్‌లో కర్తార్ పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాకిస్థాన్‌లు కలిసి నిర్మిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : శాఖర్‌గఢ్, నరోవాల్ జిల్లా, పంజాబ్ , పాకిస్థాన్
తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్న మోదీ
సింగపూర్‌లో జరుగుతున్న 13వ తూర్పు ఆసియా దేశాలసదస్సు(ఈఏఎస్)లో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని చెప్పారు.
మరోవైపు ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్‌ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : నవంబర్ 15
ఎక్కడ : సింగపూర్
డిసెంబరు 23న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు
బంగ్లాదేశ్‌లో డిసెంబరు 23న 11వ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ ఎన్నికల ప్రధానాధికారి నరుల్ హుడా నవంబర్ 8న ప్రకటించారు. దేశంలోని మొత్తం 10.42 కోట్ల ఓటర్లు 300 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోనున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలో ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించనున్నారు. కనీసం వంద నియోజకవర్గాల్లో లక్షా యాభైవేల ఈవీఎంలను వినియోగించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు
ఎప్పుడు : డిసెంబరు 23
ఎవరు : బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం
దీపావళి సందర్భంగా ఐరాస స్టాంపుల విడుదల
దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి నవంబర్ 7న రెండు స్టాంపులను విడుదల చేసింది. ఈ స్టాంపులలో ఒక దానిపై హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడి లైటింగ్‌లో ఉన్న ఐరాస ప్రధాన కార్యాలయం, మరోక దానిపై దీపాలు ఉన్నాయి. 1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపులను అంతర్జాతీయ ఎయిర్‌మేల్ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు. ‘హ్యాపీ దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగుల పండుగ సందర్భంగా యూన్ స్టాంప్స్’ అని ఈ సందర్భంగా ఐరాస ట్వీట్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీపావళి సందర్భంగా రెండు స్టాంపులు విడుదల
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ఐక్యరాజ్యసమితి
శ్రీలంక పార్లమెంటు రద్దు
శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నవంబర్ 9న నిర్ణయం తీసుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక పార్లమెంటు రద్దు
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో పాల్గొన్న మోదీ
సింగపూర్‌లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనం ‘ఫిన్‌టెక్ ఫెస్టివల్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 14న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోందన్నారు. పెట్టుబడులకు భారత్ ఇష్టమైన గమ్యంగా మారుతోందని చెప్పారు. 2016 నుంచి ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు.
అపిక్స్ అప్లికేషన్
ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో భాగంగా అపిక్స్(అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ ఎక్స్ఛేంజ్)ను సింగపూర్ ఉప ప్రధాని షన్ముగరత్నంతో కలిసి మోదీ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు వర్చుసా కంపెనీ అపిక్స్‌ను రూపొందించింది. అపిక్స్ ద్వారా దేశీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలతో సులువుగా అనుసంధానం చేసుకోవచ్చు. భారత్ సహా 23 దేశాల ప్రజలకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. మరోవైపు మోదీ ఈ పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సు, ఆసియాన్-భారత అనధికారిక సమావేశంలో పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సింగపూర్
పారిస్‌లో మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 2018, నవంబర్11 నాటికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయి్యప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్-ఎలెసైస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా నవంబర్ 11 ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. నవంబర్ 11న మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్‌నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు.
ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం :
నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు.
జాతీయవాదం వెన్నుపోటు వంటిది...
ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
మోదీ నివాళి :
భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్‌బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం
ఎప్పుడు : నవంబర్ 11న
ఎవరు : ప్రపంచ దేశాల అధినేతలు
ఎందుకు : మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికులకు ఘనంగా నివాళులు
ఎక్కడ : పారిస్
శ్రీలంక పార్లమెంటు సస్పెన్షన్ ఉపసంహరణ
శ్రీలంక పార్లమెంటుపై విధించిన సస్పెన్షన్‌ను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నవంబర్ 1న ఉపసంహరించారు. ఈ మేరకు నవంబర్ 5న పార్లమెంటును సమావేశపరిచేందుకు నిర్ణయించారు. శ్రీలంక పార్లమెంటును అక్టోబర్ 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ అక్టోబర్ 27 సిరిసేన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన సిరిసేన (అక్టోబర్ 26) నూతన ప్రధానిగా మాజీ అధ్యక్షుడు రాజపక్సను నియమించాడు. దీంతో పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే డిమాండ్ చేశారు. అయితే అందుకు అవకాశం లేకుండా పార్లమెంటును నవంబర్ 16 వరకు సస్పెన్షన్ చేస్తూ సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం సిరిసేన-రాజపక్సల పార్టీలకు 95 సభ్యులు ఉండగా విక్రమసింఘే పార్టీకి 106 మంది సభ్యులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక పార్లమెంటు సస్పెన్షన్ ఉపసంహ రణ
ఎప్పుడు : నవంబర్ 1

పాకిస్థాన్-చైనాల మధ్య 16 ఒప్పందాలు
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడంలో భాగంగా పాకిస్థాన్, చైనాల మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ వంటి 16 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. చైనాలో తొలిసారి పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా ప్రధాని కెకియాంగ్‌తో నవంబర్ 3న ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చైనా పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యాయని ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్-చైనాల మధ్య 16 ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 3న
ఎవరు : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్-చైనా ప్రధాని కెకియాంగ్
ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా
బ్యాంకింగ్, ఇంధన రంగాలు లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై నవంబర్ 5న ఆంక్షలను విధించింది. ఇరాన్‌కు చెందిన 600 కంపెనీలు, వ్యక్తులతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ప్రపంచదేశాలకు అమెరికా స్పష్టం చేసింది. వీరితో వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, భారీ జరిమానాలు విధిస్తామని తెలిపింది. అయితే ఇరాన్ నుంచి భారీగా ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, టర్కీ, జపాన్, ఇటలీ సహా 8 దేశాలకు ఈ సందర్భంగా స్వల్ప మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను 6 నెలల్లోగా పూర్తిస్థాయిలో నిలిపివేయాలని సూచించింది.
సైబర్ దాడులు, క్షిపణి పరీక్షలు, మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న ఇరాన్ ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకే ఈ ఆంక్షలను విధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ సందర్భంగా తెలిపారు. 2015లో ఇరాన్‌తో రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని మే నెలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దుచేశారు. కొత్త ఒప్పందం కోసం చర్చలకు రావాలంటూ గతంలో ఉన్న ఆంక్షలను పునరుద్ధరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్‌పై ఆంక్షలు విధింపు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : అమెరికా
పాకిస్థాన్-చైనాల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం
పాకిస్తాన్-చైనాల మధ్య విలాసవంతమైన బస్సు సర్వీసును పాకిస్థాన్ అధికారులు నవంబర్ 6న ప్రారంభించారు. పాకిస్థాన్‌లో లాహోర్‌లోని గుల్బెర్గ్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో కష్గర్ నగరానికి ఈ లగ్జరీ బస్సు బయలుదేరింది. దాదాపు 4.38 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపట్టిన చైనా పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగంగా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ‘షూజా ఎక్స్‌ప్రెస్’ అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో బస్సులను నడపనుంది. కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉండే ఈ బస్సు 36 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) మీదుగా ఈ సర్వీసు వెళ్లడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్-చైనాల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : పాకిస్థాన్

Published date : 23 Nov 2018 04:43PM