Narendra Modi: న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్లతో భేటీ అయిన మోదీ
స్థానిక నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు.
‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది.
ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’ అని మోదీ అన్నారు.
వేదికపై ‘ద ఎకోస్ ఆఫ్ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొన్నారు.
Quad Summit: క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం.. ద్వైపాక్షిక చర్చలు
‘వికసిత భారత్ అంటే ‘పుష్ప’.. ప్రోగ్రెసివ్, అన్‌స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అలాగే, ‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్ ఇండియా. ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.
అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారతీయ 5జీ మార్కెట్ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్‌లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్‌లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్ చిప్‌లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్ ఇండియా చిప్‌ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’ అన్నారు.
PM Modi: సింగపూర్‌లో మోదీ రెండు రోజుల పర్యటన.. ప్రధాని లారెన్స్‌తో ద్వైపాక్షిక చర్చలు