Skip to main content

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్‌ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా అక్టోబర్ 11న మరింత తీవ్రతరం చేసింది.
missile strikes on Ukraine
missile strikes on Ukraine

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్‌ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా అక్టోబర్ 11న మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ నగరాలే లక్ష్యంగా అక్టోబర్ 10న ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. అక్టోబర్ 11న ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్‌ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్‌స్కీ ప్రభుత్వం యూరప్‌ దేశాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్‌ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. అక్టోబర్ 11న దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్టోబర్ 10న జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను పంపుతామని హామీ ఇచ్చారు. 

Also read: Weekly Current Affairs (National) Bitbank: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని పాఠశాలలను ప్రకటించారు?

ఫేస్‌బుక్‌పై ఉగ్ర ముద్ర 
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది.

Also read: Global Innovation Index Ranking 2022: గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2022లో భారత్‌కు 40 ర్యాంకు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Oct 2022 06:22PM

Photo Stories