Malaysia Becomes visa free: భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
COP28: కాప్– 28 సమావేశాల్లో భారత్ కీలక పాత్ర
వివరాల ప్రకారం.. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్బంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు.
Pakistan makes formal request to join BRICS: బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్థాన్ దరఖాస్తు
ఈ క్రమంలో చైనా, భారత పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని వెల్లడించారు. ఇక, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక, భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది.
Bangladesh, World Bank ink $1 billion loan deal: బంగ్లాదేశ్, ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం...
Tags
- Malaysia to allow visa-free entry to indians
- malaysia becomes free visa
- malaysia announces free visa to indians
- Malaysia goes visa-free for Indians
- MalaysiaTravel
- VisaFree
- IndianTourists
- TravelPolicy
- MalaysianGovernment
- TourismAnnouncement
- InternationalRelations
- TravelNews
- International news
- Foreign relations of India