Lakhs of crores of treasure in the womb of the sea: సముద్ర గర్భంలో లక్ష కోట్ల నిధి
Sakshi Education

- 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు.
- సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది!
Published date : 11 Jun 2022 06:15PM