Karen Bass: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
Sakshi Education
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి.
రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించారు.
Published date : 18 Nov 2022 01:03PM