జనవరి 2018 అంతర్జాతీయం
Sakshi Education
‘పుతిన్ లిస్టు’ విడుదల చేసిన అమెరికా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లతో అమెరికా ‘పుతిన్ లిస్టు’ను విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు రష్యాను శిక్షించాలని అమెరికన్ కాంగ్రెస్ చేసిన చట్టం అమల్లో భాగంగా జనవరి 30న అమెరికా ఆర్థిక శాఖ ఈ జాబితాను విడుదల చేసింది.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న పుతిన్ పరిపాలన యంత్రాంగంలోని అందరి పేర్లతో పాటు కేబినెట్ మంత్రుల్ని, ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్లను ఇందులో చేర్చింది. జాబితాలోని 114 మంది రాజకీయ నాయకుల్లో పుతిన్ సహాయకులు, కేబినెట్ మంత్రుల పేర్లు ఉండగా.. 96 మంది బిలియనీర్లలో వివాదరహితులుగా పేరొందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, నిఘా విభాగాలైన ఎఫ్‌ఎస్‌బీ, జీఆర్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు
140 ఏళ్లు బతికే అవకాశం
ఆరోగ్య రంగంలో వస్తోన్న ఆధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం140 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా జనవరి 24న దావోస్‌లో ‘ఆరోగ్య రంగాన్ని మారుస్తున్న నాలుగో తరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనిషి ఆయుర్దాయం పెరగనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చైనాలో స్పై విమానం
సముద్రాల్లో విమాన వాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల డ్రోన్లు, జెట్‌ల కదలికలను కనిపెట్టడానికి వీలుగా దీనికి ఏఈఎస్‌ఏ రాడార్‌ను అమర్చారు. కేజే-600 అనే పేరుగల ఈ గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధిపరుస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా జనవరి 28న తొలిసారిగా బయటపెట్టిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా సముద్ర జలాల్లో ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు సేవలందిస్తుండగా, మూడో దానిని షాంఘైలో నిర్మిస్తోంది. తాజాగా అభివృద్ధి చేస్తున్న గూఢచర్య విమానాలను మూడో విమాన వాహక నౌకపై మోహరించే అవకాశం ఉన్నట్లు పత్రిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేజే-600 గూఢచర్య విమానం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : అభివృద్ధి చేస్తున్న చైనా
పదవిలో ఉండగా తల్లి కాబోతున్న న్యూజిలాండ్ ప్రధాని
ప్రధాని పదవిలో ఉండగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేతల జాబితాలో న్యూజిలాండ్ పధానిజసిందా అర్డెన్ (37) చేరనున్నారు. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అర్డెన్ ‘ఈ ఏడాది జూన్‌లో నేను బిడ్డకు జన్మనివ్వబోతున్నా’ అని జనవరి 19న ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కూడా పదవిలో ఉండగానే సంతానం పొందారు.
వినిమయ బిల్లును తిరస్కరించిన అమెరికా సెనెట్
అమెరికా పాలనా యంత్రాంగ నిర్వహణకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు జనవరి 19న సెనేట్‌లో 50-48 తేడాతో వీగిపోయింది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజులు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వినిమయ బిల్లును తిరస్కరించిన అమెరికా సెనెట్
ఎప్పుడు : జనవరి 19
ఎందుకు : పాలనా యంత్రాంగ నిర్వహణకయ్యే ఖర్చులను విడుదల చేసేందుకు
అమెరికాలో షట్‌డౌన్‌కు ముగింపు చర్చలు సఫలం
మూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్‌డౌన్‌కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జనవరి 22న జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు.
జనవరి 20, 21 తేదీల్లో(శని, ఆదివారం) కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం జనవరి 22న (సోమవారం) తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు
స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు జనవరి 23న ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు.
1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు - 2018
ఎప్పుడు : జనవరి 23
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎవరు : ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అమెరికా ‘షట్‌డౌన్’కు తెర
అమెరికాలో మూడు రోజులు కొనసాగిన ‘షట్‌డౌన్’ ముగిసింది. ప్రభుత్వ వ్యయానికి స్వల్పకాలిక నిధులందించే బిల్లుకు ప్రతిపక్ష డెమొక్రాట్లు మద్దతు తెలపడంతో సంక్షోభం సమసిపోయింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనవరి 23 నుంచి రోజువారీ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దేశంలోకి చిన్నారులుగా తల్లిదండ్రులతో పాటు అక్రమంగా అడుగుపెట్టిన సుమారు 7 లక్షల మంది యువకుల(డ్రీమర్స్) భవిష్యత్తుపై చర్చకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరడంతో సమస్య పరిష్కారమైంది. ఫిబ్రవరి 8న గడువు ముగిసే ఈ తాత్కాలిక ఫండింగ్ బిల్లు సెనేట్‌లో 81-18 ఓట్లు, ప్రతినిధుల సభలో 266-150 ఓట్ల తేడాతో గట్టెక్కింది.
2017లో 138 మంది పాక్ సైనికుల హతం
జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి 2017లో జరిగిన సీమాంతర కాల్పులు, వ్యూహాత్మక ఘటనల్లో 138 మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుబెట్టిందని ప్రభుత్వ నిఘా వర్గాలు వెల్లడించాయి. 28 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. 2017లో 860.. 2016లో 221 కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని వివరించాయి. 2017 డిసెంబర్ 25న ఎల్‌ఓసీ దాటి వెళ్లి ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టిన ఘటననూ అందులో పేర్కొన్నాయి. సాధారణంగా పాక్ సైనికుల మరణాలను అక్కడి ఆర్మీ ధ్రువీకరించదని, కొన్ని సందర్భాల్లో సైనికుల మరణాలను పౌరుల మరణాలుగా చూపిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
డిఫాల్టర్లపై చైనా కఠిన చర్యలు
ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితా లోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.
పాక్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తామని అమెరికా ప్రకటన
ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్‌కు మిలటరీ సాయం నిలివేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : అమెరికా
ఎందుకు : ఉగ్రవాదులపై చర్యలు తీసుకోనందుకు
అమెరికా-మెక్సికో గోడకు 1.14 లక్షల కోట్లు
మెక్సికో సరిహద్దులో గోడనిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడకు రూ. 1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్
కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విసృ్తతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌లో వేగంగా విస్తరిస్తున్న ఐఎస్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్
ఉభయ కొరియాల మధ్య మిలటరీ హాట్‌లైన్
ఉభయ కొరియా దేశాల మధ్య రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో జనవరి 9న ఈ చర్చలు మొదలయ్యాయి.
సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారి
ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారికి ఉద్వాసన
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : అబు అలీ
ఎందుకు : ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకున్నందుకు
సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణం
ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉందని యునిసెఫ్ వెల్లడించింది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
ఏమిటి : సంక్షోభ ప్రాంతాల్లో దారుణంగా చిన్నారుల పరిస్థితి
ఎప్పుడు : 2017లో
ఎవరు : యునిసెఫ్
ఎక్కడ : ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాలో
పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరిక
ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ట్వీటర్‌లో జనవరి 1న ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఉండబోదని హెచ్చరిక
ఎప్పుడు : జనవరి 1

ఎందుకు : ఉగ్రవాదం విషయంలో అవాస్తవాలతో మోసం చేస్తుందని ఆరోపణ
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్నును అమల్లోకి తెచ్చిన రెండు దేశాలు
ఎప్పుడు : జనవరి 1 నుంచి
ఎవరు : సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలు
న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.
లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్
లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.

- నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది.
- తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు.
- కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు.
- సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు.
- మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
- ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు.
- రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది.
ఏమిటి : సంక్షోభ ప్రాంతాల్లో దారుణంగా చిన్నారుల పరిస్థితి
ఎప్పుడు : 2017లో
ఎవరు : యునిసెఫ్
ఎక్కడ : ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాలో
పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరిక
ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ట్వీటర్‌లో జనవరి 1న ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఉండబోదని హెచ్చరిక
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : ఉగ్రవాదం విషయంలో అవాస్తవాలతో మోసం చేస్తుందని ఆరోపణ
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్నును అమల్లోకి తెచ్చిన రెండు దేశాలు
ఎప్పుడు : జనవరి 1 నుంచి
ఎవరు : సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలు
న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.
లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్
లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.
Published date : 05 Jan 2018 03:01PM