Skip to main content

ISIS: ఐసిస్‌ చీఫ్‌ హతం.. కొత్త సారథిని ప్రకటించిన ఉగ్రసంస్థ

ప్రపంచానికి పెను సవాలుగా మారిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌(ఐసిస్‌)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

దాని ప్రస్తుత అధినేత అబూ అల్‌ హసన్‌ అల్‌ హషిమి అల్‌ ఖురేషి ఇటీవల జరిగిన దాడుల్లో మరణించారని ఐసిస్‌ అధికార ప్రతినిధి అబూ ఒమర్‌ అల్‌ ముహాజిర్ న‌వంబ‌ర్ 30వ తేది ప్రకటించారు. ‘దేవుని శత్రువులతో పోరాడుతూ ఖురేషి మరణించారు’ అంటూ ముహాజిర్‌ అధికారికంగా ఒక ఆడియా సందేశం విడుదలచేశారు. ఏ దేశ సైన్యం, ఎవరు చేసిన దాడుల్లో ఇతను హతమయ్యాడనే వివరాలు ఐసిస్‌ వెల్లడిచేయలేదు. ఏ రోజు, ఏ ప్రాంతంలో మరణించిందీ పేర్కొనలేదు.

➤ చైనా మాజీ అధినేత జియాంగ్‌ జెమిన్‌ మృతి
ఇరాక్‌కు చెందిన ఖురేషిని తామే చంపేశామని ఏ దేశమూ ఇంతవరకూ ప్రకటించుకోలేదు. సిరియా, ఇరాక్‌లలో భారీ స్థాయిలో దాడులకు తెగబడి ఆ దేశాల్లో మళ్లీ ఇస్లామిక్‌ రాజ్యస్థాపనకు సంసిద్ధమవుతున్నట్లు ఐసిస్‌ ప్రకటించుకున్న కొద్దిరోజులకే సంస్థ చీఫ్‌ను కోల్పోవడం గమనార్హం. అయితే, మరో నేతను తమ చీఫ్‌గా ఐసిస్‌ బుధవారం ప్రకటించింది. ఇకపై అబూ అల్‌ హుస్సేన్‌ అల్‌ హుస్సేనీ అల్‌ ఖురేషి తమ చీఫ్‌గా ఉంటారని తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఐసిస్‌ వ్యవస్థాపక చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీని అమెరికా సేనలు అంతంచేశాక తదుపరి దాడుల్లో అంతమైన అగ్రనేతల్లో ఖురేషి మూడోవాడు.

Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా స‌క్సెస్ సిక్రెట్ ఇదే..

Published date : 02 Dec 2022 01:34PM

Photo Stories