COP27: భూతాపానికి కారణం మేం కాదు: కాప్27లో భారత్ స్పష్టీకరణ
ఈ విషయంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌వంటి భావసారూప్య దేశాలు మనకు బాసటగా నిలిచాయి. వాతావరణ మార్పులపై ఈజిప్టులో జరిగిన కాప్–27 చర్చల్లో ఈ దేశాలు తమ వాణి వినిపించాయి. ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో తమతోపాటు భారత్, చైనా వంటి దేశాలూ ముమ్మర చర్యలు చేపట్టాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకుంటున్నాయి. 2010తో పోలిస్తే 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 45శాతం తగ్గించాలని గత ఏడాది కాప్–26 సదస్సులో తీర్మానించారు. ఆర్థిక, సాంకేతిక సాయాన్ని తమకు అందించకుండా లక్ష్యాలను సవరించుకోవాలంటే.. ఎలా అని వర్థమాన దేశాలు ప్రస్తుత సదస్సులో ప్రశ్నించాయి. మొత్తం కర్బన ఉద్గారాల్లో 20 శాతాన్ని వెలువరిస్తూ ప్రపంచంలో తొలి స్థానంలో అమెరికా ఉంది. చైనా రెండో స్థానంలో(11శాతం), రష్యా మూడో స్థానంలో (7 శాతం), భారత్‌ఏడో స్థానంలో(3.4శాతం) ఉన్నాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP