COP26 Summit: పర్యావరణ పరిరక్షణకు ఐదు సూత్రాల అజెండాకు ప్రకటించిన దేశం?
యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగమైన స్కాట్‌లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో జరుగుతున్న కాప్ –26 సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు–2021)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 1న ప్రసగించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరిస్తూ ఐదు సూత్రాల ప్రణాళికలను మోదీ ప్రకటించారు. 2021, అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ సదస్సు నవంబర్ 12 వరకు కొనసాగనుంది. పర్యావరణ పరిరక్షణ అంశాలపై చర్చలు జరిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు
- వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమే.
- ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమే.
- ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
- జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమే. గ్లోబల్ మిషన్‌గా మారాలి.
- క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని అభివృద్ధి చెందిన దేశాలు నిలబెట్టుకోవాలి.
- సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉంది.
ఐదు సూత్రాల అజెండా
1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం.
2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం.
3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం.
4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం.
5. నెట్ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధిస్తుంది.
చదవండి: జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాప్ –26 సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు–2021)లో ప్రసంగం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్లాస్గో నగరం, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్