Skip to main content

Tourism Index 2021: ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీలో భారత్‌కు 54వ స్థానం

Tourism Index 2021: ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీలో భారత్‌ స్థానం?
Tourism Index 2021
India Ranks 54th In Travel and Tourism Development Index 2021

Travel and Tourism Development Index 2021: అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ–2021లో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఎనిమిది స్థానాలు దిగజారడం గమనార్హం. అయితే ఇప్పటికీ దక్షిణాసియాలో మొదటి స్థానంలో ఉంది. జపాన్‌ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా.. అమెరికా, స్పెయిన్‌ , ఫ్రా¯Œన్స్‌, జర్మనీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల ఆర్థిక వ్యవస్థలు, అక్కడి ప్రయాణ, పర్యాటక రంగాల్లో వృద్ధి, భద్రత, ఆరోగ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, పర్యావరణం తదితర అంశాల ఆధారంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) ఈ నివేదికను రూపొందించింది. రెండేళ్లకోసారి రూపొందించే ఈ అధ్యయనాన్ని 2019 వరకు ‘ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచీ’ పేరుతో విడుదల చేసింది. ప్రపంచ పర్యాటక సంస్థ వివరాల ప్రకారం–కరోనా తర్వాత ఈ రంగంలో పునరుద్ధరణ అసమానంగా ఉంది. జనవరి 2022లో పర్యాటకుల రాక 2019 జనవరితో పోల్చితే 67 శాతం తక్కువగా ఉంది.

WEF’s Travel & Tourism Development Index : అంతర్జాతీయ పర్యాటక సూచిలో భారత్‌ డౌన్‌!

Published date : 30 May 2022 06:33PM

Photo Stories