ప్రపంచంలోనే తయారీ హబ్‌గా భారత్
ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి, మరోవైపు ఉక్రెయిన్ లో సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలు నెలకొన్నాయి. వీటివల్ల సరఫరా గొలుసుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతోన్న తరుణంలో.. మెరుగైన రవాణా వ్యవస్థలను కొనసాగించడానికి ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉజ్బెకిస్థాన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో సభ్య దేశాలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్‌ను ప్రపంచంలోనే తయారీ హబ్‌గా తీర్చిదిద్దడంలో పురోగతి సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వాణిజ్యాన్ని మెరుగుపరచుకునే మార్గాలు, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ , చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్‌తోపాటు ఎస్‌సీవో కూటమి దేశాల అధినేతలు చర్చించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP