Skip to main content

United Nations Report: భారత్‌లో విస్తరిస్తున్న నల్లమందు అమ్మకాలు

United Nations Report
United Nations Report

నల్లమందు వాడకందారుల సంఖ్య, అలాగే అమ్మకాల పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్‌ మారుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ నుంచి పెద్దఎత్తున సరకు భారత్‌కు వస్తున్నందువల్ల మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని పేర్కొంది. మాదక ద్రవ్యాలు–నేరాలపై ‘ప్రపంచ మాదకద్రవ్య నివేదిక–2022’ను ఐరాస ఇటీవల విడుదల చేసింది.2020 లో ప్రపంచవ్యాప్తంగా 15–64ఏళ్ల మధ్య వయసువారిలో 28.4 కోట్ల మంది ప్రజలు మాదకద్రవ్యాలను వినియోగించారని ఈ నివేదిక తెలిపింది. అంతకుముందు దశాబ్దం కంటే ఇది 26శాతం ఎక్కువ.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Jul 2022 06:20PM

Photo Stories