Skip to main content

Strongest Earthquake: 25 ఏళ్ల తరువాత భారీ భూకంపం.. ఎక్క‌డంటే..

తైవాన్‌లో ఏప్రిల్ 3వ తేదీ తెల్లవారుజామున భారీ భూకంపం చోటు చేసుకుంది.
Earthquake Hits Taiwan Japan Issues Tsunami Alert

తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. 

తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. 

1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు. భూకంపం కారణంగా తైవాన్‌ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని  కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్‌ పూల్‌ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్‌ పూల్‌లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్‌పూల్‌ ఉ‍న్న భయభ్రాంతులకు గురయ్యాడు. 

Rain Tax: వర్షం కురిస్తే ట్యాక్స్ త‌ప్ప‌కుండా కట్టాల్సిందే..!

Published date : 03 Apr 2024 04:04PM

Photo Stories