Skip to main content

Emergency Needs: నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని ప్రకటించిన దేశం?

China Flag

చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం నవంబర్‌ 1న ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్‌ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ తెలిపింది.

అనేక సందేహాలు..
ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని చైనా ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన.. అక్కడి ప్రజలను అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్‌ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చ‌ద‌వండి: భారత్‌ ప్రారంభించిన ఐరిస్‌ కార్యక్రమ ఉద్దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Nov 2021 05:56PM

Photo Stories