Skip to main content

Americaతో అన్ని రకాల చర్చలు రద్దు చేసిన China

తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించినందుకు నిరసనగా చైనా మరిన్ని చర్యలను ప్రకటించింది.
China and thaiwan
China cancels talks with U.S. on military issues

పెలోసీ, ఆమె కుటుంబసభ్యులు తైవాన్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించింది. రక్షణ, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై అమెరికాతో జరుగుతున్న చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ఆగస్టు 5న ప్రకటించింది. ‘మా తీవ్ర ఆందోళనను, వ్యతిరేకతను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్‌ను సందర్శించారు. ఈ చర్య ద్వారా చైనా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. చైనా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించారు. ఒకే చైనా విధానాన్ని తుంగలో తొక్కారు. తైవాన్‌ జల సంధిలో శాంతి, సుస్థిరతలను దెబ్బతీశారు. ఇందుకు బదులుగా ఆంక్షలు విధిస్తున్నాం’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘చైనా–యూఎస్‌ థియేటర్‌ కమాండర్స్, చైనా–యూఎస్‌ డిఫెన్స్‌ పాలసీ కోఆర్డినేషన్, చైనా–యూఎస్‌ మిలటరీ మారిటైమ్‌ కన్సల్టేటివ్‌ అగ్రిమెంట్‌పై జరిగే చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు చైనా మరో ప్రకటనలో పేర్కొంది. అక్రమ వలసదారులను తిరిగి చైనాకు తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన చర్చలు, నేరగాళ్లు, మాదకద్రవ్యాలు, వాతావరణ మార్పులపై అమెరికాతో చర్చల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపింది. తైవాన్‌ తమదేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా అంటోంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత తైవాన్‌లో పర్యటించిన అమెరికా అత్యున్నత హోదా అధికారి పెలోసీయే. ఆమె రాకపై తీవ్రంగా స్పందించిన చైనా తైవాన్‌ జల సంధిని దిగ్బంధించింది. తైవాన్‌ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టేందుకు శుక్రవారం 100 యుద్ధ విమానాలను, 10 యుద్ధ నౌకలను పంపించింది. 

Also read: అమెరికా Taiwan పర్యటనతో China ఆగ్రహం

మమ్మల్ని చైనా అడ్డుకోలేదు: పెలోసీ 
చైనా ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలపై జపాన్‌ పర్యటనలో ఉన్న పెలోసీ స్పందించారు. అమెరికా అధికారులు తైవాన్‌లో పర్యటించకుండా చైనా అడ్డుకోలేదన్నారు. తైవాన్‌ను చైనా ఏకాకిని చేయలేదన్నారు. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా కొనసాగిస్తున్న సైనిక విన్యాసాలను బాధ్యతారాహిత్యమైనవి, రెచ్చగొట్టేవి అంటూ అమెరికా పేర్కొంది.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Aug 2022 05:57PM

Photo Stories