Skip to main content

Canada PM Justin Trudeau: కెనడా దేశ కరెన్సీ పేరు ఏమిటీ?

Canadian PM Justin Trudeau

కెనడాలో జస్టిన్‌ ట్రూడో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్నారు. అధికార లిబరల్‌ పార్టీ, విపక్ష న్యూ డెమొక్రటిక్‌ పార్టీ్ట(ఎన్‌డీపీ) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే దీనికి న్యూ డెమొక్రటిక్‌ పార్టీ అంగీకారం తెలపాల్సి ఉందని సమాచారం. 2021, సెప్టెంబర్‌లో జరిగిన కెనడా పార్లమెంట్‌ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్‌ పార్టీ 338 స్థానాలకుగాను 159 చోట్ల గెలిచింది. అయితే మెజారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో జగ్మీత్‌సింగ్‌ నేతృతృంలోని విపక్ష ఎన్‌డీపీ మద్దతు ట్రూడో ప్రభుత్వానికి అవసరమైంది. 2015లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ట్రూడో రికార్డు సృష్టించారు.

కెనడా..
రాజధాని:
ఒట్టోవా; కరెన్సీ: కెనడియన్‌ డాలర్‌
అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: జస్టిన్‌ ట్రూడో

World Water Day 2022 Theme: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

రష్యా గ్యాస్‌ వదులుకోలేం: జర్మనీ
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ మార్చి 22న చెప్పారు. పలు యూరప్‌ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. జర్మనీ గ్యాస్‌ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే.

జర్మనీ..
రాజధాని:
బెర్లిన్‌; కరెన్సీ: యూరో
అధికార భాష: జర్మన్‌
ప్రస్తుత అధ్యక్షుడు: ఫ్రాంక్‌–వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌
ప్రస్తుత చాన్సలర్‌: ఒలాఫ్‌ స్కోల్జ్‌

2021 World Air Quality Report: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరం ఏది?

Published date : 23 Mar 2022 07:01PM

Photo Stories