Skip to main content

Monkeypox: మంకీ పాక్స్‌ నియంత్రణకు క్వారంటైన్‌

Monkeypox: మంకీ పాక్స్‌ నియంత్రణకు క్వారెంటైన్‌ను తప్పనిసరి చేసిన తొలి దేశం?
Belgium becomes first country to introduce compulsory monkeypox quarantine
Belgium becomes first country to introduce compulsory monkeypox quarantine

Telugu Current Affairs - International: మంకీ పాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. మరోవైపు మంకీపాక్స్‌ నియంత్రణలో భాగంగా వ్యాధి సోకిన వారికి 21రోజుల క్వారెంటైన్‌ను తప్పనిసరి చేసిన తొలి దేశంగా బెల్జియం వార్తల్లో నిలిచింది. మంకీపాక్స్‌ కూడా మశూచి లాంటిదే. 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో దీన్ని గుర్తించారు. అందుకే మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. మానవుల్లో తొలి కేసు 1970లో నమోదైంది. మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమైన వ్యాధి ఇది. అరుదుగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ఇది ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. తాజా వ్యాప్తిలో ఎక్కడా మరణాలు సంభవించలేదు. వ్యాధి సోకిన జంతువు కరిచినా.. ఈ ఇన్‌ ఫెక్షన్‌ కు గురైన మానవుడి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. తుంపర్లతోనూ వ్యాపిస్తుంది.

Monkeypox రోగులకు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసిన మొదటి దేశం బెల్జియం

Published date : 30 May 2022 06:57PM

Photo Stories