India-Nordic Summit 2022: ఇండియా–నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు?
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్ లో నిర్వహించిన ఇండియా–నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళదామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావిస్తూ నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియా నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్బంగా.. మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టారెతో భేటీ అయ్యారు. అలాగే స్వీడన్ ప్రధాని మగ్దలెనా ఆండర్సోన్ తో సమావేశంలో.. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికతలు, నవోన్వేషణలు తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారంపై చర్చించారు. అదేవిధంగా ఐస్‌లాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్స్‌దతిర్‌తో భేటీ అయ్యారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారున్ తో జరిగిన సంప్రదింపుల్లో డిజిటల్ భాగస్వామ్యం, పెట్టుబడుల అనుసంధానత, వాణిజ్య భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి.
United Nations: ఐరాస అంచనాల ప్రకారం... ఏడాదికి 560 విపత్తులు సంభవించనున్నాయి?