Skip to main content

National Civil Services Day: నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం.. ఈ రోజు ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

దేశంలో పరిపాలనా యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్ల సేవలకు గుర్తుగా మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని(National Civil Services Day) నిర్వహిస్తున్నారు.
National Civil Services Day 2023

మొదటి నేష‌న‌ల్ సివిల్ స‌ర్వీస్ డేను 2006లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డును సివిల్ సర్వెంట్లకు అందజేస్తారు. దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లలో ప‌ని చేస్తున్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1947లో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆధికారుల‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజు ప్రసంగించడం విశేషం. ఆ క్రమంలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను భారతదేశపు ఉక్కు చట్రంగా అభివర్ణించారు. 

Jallianwala Bagh Massacre: జలియన్ వాలాబాగ్ ఊచకోత‌కు 104 ఏళ్లు..

కాగా సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు. ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత. భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B అనే విభాగాలుగా ఉంటాయి. ఇదే రోజు వివిధ కార్యాలయాలు తమ తమ డిపార్ట్‌మెంట్‌ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తాయి. ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క పితామహుడిగా లార్డ్ కార్న్‌వాలిస్‌ను పిలుస్తారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని  పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులను ఉద్దేశించి ప్రసంగించిన అనంత‌రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల కింద వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షలు ఉంటుంది. 

World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

Published date : 21 Apr 2023 05:20PM

Photo Stories