Operation Smile: బాలల భవిష్యత్ కోసమే ఆపరేషన్ స్మైల్
బాల కార్మికులుగా ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో వెట్టిచాకిరి చేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్–10 కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభించామని తెలిపారు. చిన్నారులను పనికి పెట్టుకున్న యాజమాన్యాల నుంచి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా చదువుపై ఆసక్తి ఉన్న పిల్లలకు చదువు నేర్పించేందుకు ఇతర శాఖల అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అనాథ బాలలను గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 23మంది బాధిత బాలలను రక్షించినట్లు తెలిపారు. పనుల నుంచి విముక్తి కలిగించేందుకు 1098 లేదా 100 ఫోన్‌నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించొద్దన్నారు. పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.