Become An IAS: ఐఏఎస్ కావాలనుకుంటున్నారా... అయితే ఇంటర్ నుంచి ఈ టిప్స్ ఫాలోకండి...
అయితే ఇంటర్ తర్వాత మీరు కెరియర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు సివిల్స్ ర్యాంకు కొట్టేందుకు అవకాశం ఉంది.
పదో తరగతి తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యే విద్యార్థులు ఇక్కడే తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఇలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటే సివిల్స్ పరీక్ష రాయడానికి ఉపయోగపడుతుంది.
IAS Success Story: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
12వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేయాలి. ఇక్కడ కూడా హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు తీసుకుంటే అవి సివిల్ సర్వీస్ పరీక్షకు మంచి పునాది వేస్తాయి.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలనుకునే ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పేపర్ చదవడం నేర్చుకోవాలి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏం డెవలప్‌మెంట్ జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్‌పై మంచి పట్టుసాధించాలి.
పోటీ పరీక్షలంటేనే పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోటీలో నెగ్గుకురావాలనుకున్న వారు మంచి పేరున్న కోచింగ్ సెంటర్స్‌ను ఎంచుకోవాలి. ఇన్‌స్టిట్యూట్ లో చేరడం వల్ల పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్టడీ మెటీరియల్‌ను ఎంచుకోవాలి, ఏయే టాపిక్స్‌పై పట్టుపెంచుకోవాలి అన్న విషయాలపై అవగాహన వస్తుంది.
సివిల్స్, గ్రూప్స్ పరీక్షలలో ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి రీడింగ్ స్కిల్స్‌తో పాటు రైటింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి ఎస్సే రైటింగ్, ఆన్సర్ రైటింగ్ తో పాటు పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి.
దీర్ఘకాలిక ప్రణాళికతోనే సివిల్స్ కానీ, ఇంకేదైనా పోటీ పరీక్షలలో కానీ సత్తా చాటుతాం.