World Trade Organization: డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడం, పేటెంట్ మినహాయింపు ప్రతిపాదన వంటి అంశాలపై చర్చించడానికి వర్చువల్‌గా మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహించాలన్న భారత్ విజ్ఞప్తిని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) జనరల్ కౌన్సిల్ చర్చించింది. ఈ మేరకు 2021 డిసెంబర్ 23వ తేదీన జనరల్ కౌన్సిల్ చీఫ్‌కు భారత్ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయా ప్రతిపాదనలపై 2022, జనవరి 10వ తేదీన జనరల్ కౌన్సిల్ చైర్ అంబాసిడర్ డేసియో క్యాస్టిలో (హోండూరాస్) ఒక సమావేశంలో చర్చించినట్లు డబ్ల్యూటీఓ ఒక ప్రకటనలో పేర్కొంది.
జెనీవాలో..
1995, జనవరి 1న ఏర్పాటైన డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఉంది. 164 దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ దీని అధికార భాషలుగా ఉన్నాయి. ఎగుమతుల–దిగుమతుల విధానాలు, వాణిజ్య సంబంధ అంశాలపై రెండు దేశాల మధ్య ఏర్పడే వివాదాలపై డబ్ల్యూటీఓ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్‌గా నైజీరియన్–అమెరికన్ ఆర్థికవేత్త నాగోజి ఒకోంజో–ఇవెలా ఉన్నారు.
చదవండి: సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ను రూపొందించిన తొలి సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహించాలన్న భారత్ విజ్ఞప్తిపై చర్చ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) జనరల్ కౌన్సిల్
ఎక్కడ : జెనీవా, స్విట్జర్‌ల్యాండ్
ఎందుకు : కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడం, పేటెంట్ మినహాయింపు ప్రతిపాదన వంటి అంశాలపై చర్చించడానికి భారత్ విజ్ఞప్తి చేసింది
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్