Swedish Audio Brand: సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ను రూపొందించిన తొలి సంస్థ?
ఆడియో ఉత్పత్తుల తయారీలో ఉన్న స్వీడన్ బ్రాండ్ అర్బనిస్టా జనవరి 10న భారత్‌లో అడుగుపెట్టింది. ప్రపంచంలో తొలి సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్‌ఫోన్స్ ‘‘అర్బనిస్టా లాస్ ఏంజిల్స్’’తోపాటు ప్రపంచంలో అతి చిన్న ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ ‘‘అర్బనిస్టా లిస్బన్’’ను ఇక్కడ పరిచయం చేసింది. భారత హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ మార్కెట్‌లో 2022 ఏడాది చివరినాటికి 5 శాతం వాటాను దక్కించుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. దేశంలో హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ విపణి రూ.81,400 కోట్లు ఉంది.
మాండరిన్ ఓరియంటల్‌ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రీమియం లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంటల్‌లో 73.37 శాతం వాటాలను దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్) కొనుగోలు చేసింది. 98.15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 735 కోట్లు) విలువైన ఈ డీల్ 2022, మార్చి ఆఖరుకు పూర్తి కావచ్చని రిలయన్స్ పేర్కొంది.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎవరు ఉన్నారు?
ఫిన్ టెక్ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేస్రి ఈ విషయం తెలిపారు.
చదవండి: రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలో తొలి సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్‌ఫోన్స్ ‘‘అర్బనిస్టా లాస్ ఏంజిల్స్’’ను భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్థ?
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : స్వీడన్‌కి చెందిన అర్బనిస్టా
ఎందుకు : భారత మార్కెట్‌లో వాటా దక్కించుకోవడం కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్