United Nations: ఐరాస అంచనాల ప్రకారం... 2021లో భారత్ వృద్ధి రేటు?
2021 సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి అంచానా వేసింది. అయితే 2022 ఏడాదిలో ఈ వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 16న విడుదలైన ‘యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక 2021’లో ఈ విషయాలను వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన మానవతా, ఆర్థిక నష్టం, ప్రైవేటు వినియోగంపై ధరల పెరుగుదల ప్రభావం భారత్‌లో వృద్ధికి అవరోధాలు కలిగించినట్టు నివేదిక పేర్కొంది. 2021 ఏడాది ప్రపంచ స్థూల ఉత్పత్తి 5.3 శాతం ఉంటుందని అంచనా వేసింది.
జనవరిలో డబ్ల్యూఈఎఫ్ దావోస్ సదస్సు...
కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన రెండేళ్ల తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తొలిసారిగా పూర్తి స్థాయి వార్షిక సదస్సు నిర్వహించనుంది. 2022 జనవరిలో 17–21 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో దీన్ని నిర్వహించనున్నట్లు డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వధినేతలు, పౌర సమాజ నేతలు, ఆర్థికవేత్తలు మొదలైన వారు సదస్సుకు హాజరు కానున్నారు.
చదవండి: భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుంది
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక–2021