Ford Motor Company: భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?
Sakshi Education
వాహన తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్
ఎక్కడ : సనంద్(గుజరాత్), చెన్నై(తమిళనాడు)
ఎందుకు : కంపెనీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా...
పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ సనంద్‌లోని అసెంబ్లింగ్ సెంటర్‌ను 2021 ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్–జూన్ కాలంలో మూసివేస్తామని సెప్టెంబర్ 9న కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్ మోటార్స్ కాగా రెండోది ఫోర్డ్ కానుంది.
దేశంలో భారీ పెట్టుబడులు...
సనంద్, చెన్నైలోని రెండు ప్లాంట్లపై ఫోర్డ్ సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. సంస్థ తాజా నిర్ణయంతో వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి. గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్‌షిప్స్ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది.క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్
ఎక్కడ : సనంద్(గుజరాత్), చెన్నై(తమిళనాడు)
ఎందుకు : కంపెనీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా...
Published date : 11 Sep 2021 06:22PM