Skip to main content

CMIE: దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది?

Job Less

2021 డిసెంబర్‌ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్‌ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని జనవరి 2న తెలిపింది. సీఎంఐఈ తెలిపిన ప్రకారం...

  • జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది.
  • దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదైంది.
  • హరియాణ తర్వాత స్థానాల్లో రాజస్తాన్‌ (27.1 శాతం) జార్ఖండ్‌ (17.3 శాతం), బిహార్‌ (16 శాతం), జమ్మూకశ్మీర్‌ (15 శాతం) ఉన్నాయి.
  • దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైంది.

చ‌ద‌వండి: బ్రిటన్‌ కంపెనీ ఫారడియన్‌ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : 2021 డిసెంబర్‌ చివరినాటికి దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది?
ఎప్పుడు  : జనవరి 2
ఎవరు    : సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)
ఎక్కడ    : హరియాణా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Jan 2022 07:04PM

Photo Stories