PLFS: ఎన్‌ఎస్‌వో సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు?
దేశంలో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) 12.6 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగ రేటు కరోనా కారణంగా 20.8 శాతానికి పెరిగిపోవడంతో.. అక్కడి నుంచి తగ్గినట్టు కనిపిస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) మార్చి 14న విడుదల చేసిన ‘11వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పనిచేయగలిగి ఉండి, ఉపాధి లేకుండా ఉన్న వారిని నిరుద్యోగ రేటు కింద పరిగణిస్తారు. 15 ఏళ్లు అంతకుమించి వయసులోని వారిని ఈ గణాంకాల కిందకు ఎన్‌ఎస్‌వో పరిగణనలోకి తీసుకుంటోంది.
NLMC: నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం?
తాజా గణాంకాలు వివరంగా..
- పట్టణాల్లో మహిళల నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్ – జూన్ కాలంలో 21.1 శాతంగా ఉంటే, 2021 ఏప్రిల్–జూన్ కాలానికి 14.3 శాతానికి దిగొచ్చింది. కానీ అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. 2021 జనవరి–మార్చిలో ఇది 11.8 శాతంగా ఉంది.
- పురుషుల్లో ఈ రేటు 20.7 శాతం నుంచి 12.2 శాతానికి తగ్గింది. 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 9.6 శాతంగా ఉండడం గమనార్హం.
- కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్–జూన్ కాలానికి 46.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఉన్న 45.9 శాతంతో చూస్తే స్వల్పంగా పెరిగింది. అంటే ఈ మేరకు పనిచేసే మానవవనరులు పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. కానీ 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 47.5 శాతంగా ఉంది.
Rebrand: రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) నిరుద్యోగ రేటు 12.6 శాతంగా నమోదైంది
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన ‘11వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్)
ఎక్కడ : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్