Hotels and Restaurantsలో సర్వీస్ చార్జీలపై నిషేధం
హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల వడ్డింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై సర్వీస్ చార్జీలను విధించడాన్ని, బిల్లుల్లో ఆటోమేటిక్‌గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ జూలై 4న ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Also read: NITI Aayog report: ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్
‘సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయి. మెనూ లో చూపే ఆహార ఉత్పత్తుల ధరలు, వాటికి వర్తించే పన్నులకు అదనంగా ఏదో ఒక ఫీజు లేదా చార్జీ ముసుగులో అవి దీన్ని విధిస్తున్నాయి. ఏ హోటలూ లేదా రెస్టారెంటూ బిల్లులో సర్వీస్ చార్జీని ఆటోమేటిక్‌గా చేర్చకూడదు. దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదు. ఇది స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి’ అని పేర్కొంది.
Also read: PSEB 10th Result 2022: How to check?
అలాగే, సర్వీస్ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. ఆహారం బిల్లులో సర్వీస్ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్‌టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ బిల్లు మొత్తంపై 10 శాతం సర్వీస్ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also read: All About Rakesh Jhunjhunwala!
ఫిర్యాదులు ఇలా..
ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంటు సర్వీస్ చార్జి విధించిన పక్షంలో, బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) నంబరు 1915కి లేదా ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సత్వర పరిష్కారం కోసం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ–దాఖిల్ పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విచారణ, చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి ఈ–మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP