NITI Aayog report: ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్
Sakshi Education
దేశంలో తాత్కాలిక కార్మికుల(గిగ్ వర్కర్ల) సంఖ్య 2029–30 నాటికల్లా 2.35 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 2020–21లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు, వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల (వైద్యసేవలు, బీమా, పెన్షన్ )ను అందించాలని సిఫారసు చేసింది. ‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం–2020–21లో రిటైల్‌ట్రేడ్, విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు–బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగ్ వర్కర్లున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 07:23PM