Nirmala Sitharaman: చెలామణిలో ఉన్న నోట్ల విలువ.. రూ.31.92 లక్షల కోట్లు
Sakshi Education
ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 19న లోక్‌సభలో తెలిపారు.
‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్‌బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం(1950) వంటివి రద్దవుతాయి.
GST: రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
Published date : 20 Dec 2022 11:45AM