Skip to main content

Unnati Program: దేశవ్యాప్తంగా డేటా ఆధారిత ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ?

పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్చిప్తయారీ దిగ్గజం ఇంటెల్వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అక్టోబర్ 21న సంస్థ వెల్లడించింది. ల్యాబ్స్ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్భాగస్వామిగా ఇంటెల్తోడ్పాటు అందిస్తుంది.

 

తాన్లా ఇన్నోవేషన్సెంటర్ఎక్కడ ఏర్పాటు కానుంది?

దేశీ  సీపాస్‌ (కమ్యూనికేషన్ప్లాట్ఫాం యాజ్ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్ఫామ్స్‌.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా దాదాపు రూ. 70 కోట్లతో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్అండ్ఎక్స్పీరియన్స్సెంటర్ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీ న్లెర్నింగ్‌ (ఎంఎల్‌), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. ఈ విషయాలను కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్రెడ్డి తెలిపారు.       

చ‌ద‌వండి: డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

క్విక్రివ్యూ   :

ఏమిటి        : ఉన్నతి కార్యక్రమంలో భాగంగా... దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు

ఎప్పుడు     : అక్టోబర్ 21

ఎవరు         : ఎలక్ట్రానిక్చిప్తయారీ దిగ్గజం ఇంటెల్

ఎక్కడ       : భారత్

ఎందుకు     : పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు...

 

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి:

తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Oct 2021 02:16PM

Photo Stories