Imports from Russia: రష్యా నుంచి భారత్‌కు భారీగా దిగుమతులు
క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.
India's Exports in October: అక్టోబర్ ఎగుమతులల్లో పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.
Wholesale inflation: అక్టోబర్‌లోనూ టోకు ద్రవ్యోల్బణం రివర్స్