Skip to main content

India's Exports in October: అక్టోబర్ ఎగుమతులల్లో పెరుగుద‌ల‌

భారత్‌ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
India's overall exports increases in October

 అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా  ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్‌ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి.

Wholesale inflation: అక్టోబర్‌లోనూ టోకు ద్రవ్యోల్బణం రివర్స్‌

అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్‌ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.  

వాణిజ్యలోటు 31.46 బిలియన్‌ డాలర్లు

ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్‌ నుంచి 2023 సెపె్టంబర్‌ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 

Retail inflation: అక్టోబర్‌లో మరింత తగ్గిన‌ ద్రవ్యోల్బణం

Published date : 16 Nov 2023 01:52PM

Photo Stories