Skip to main content

India's Economy: ఆర్థిక వృద్ధిలో భారత్‌ ఎకానమీ ట్రాక్‌ రికార్డ్

భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్‌ రికార్డు) కలిగి ఉందని రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ పేర్కొంది.
India's economy has track record of strong growth

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్‌ డ్రాగన్స్, రోరింగ్‌ టైగర్స్‌’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్‌ క్రెడిట్‌ అవుట్‌లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

Fintech sector: భవిష్యత్తులో బ్యాంకింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఫిన్‌టె

  •  సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు.    
  • 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్‌ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది.
  • శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు.
  •  ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్‌లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం.
Published date : 09 Nov 2023 03:45PM

Photo Stories