Piyush Goyal: 2021–22 ఏడాదిలో భారత్ ఎగుమతుల లక్ష్యం?
భారత్ ఎగుమతులు 2021 డిసెంబర్‌లో 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2020 ఇదే నెలతో పోల్చితే (27 బిలియన్ డాలర్లు) ఇది 37 శాతం పెరుగుదల. ఎగుమతుల చరిత్రలో ఒక నెల్లో ఈ స్థాయి స్పీడ్ ఇదే తొలిసారని జనవరి 3న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (88) ఇక లేరు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన జనవరి 3న చెన్నైలో టీ నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న జన్మించిన పీసీ రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామానికి చెందిన ఆయన 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. ‘అనురాధ’ (1971) చిత్రంతో దర్శకుడిగా మారి.. దాదాపు 75 సినిమాలకు దర్శకత్వం వహించారు.
టాప్ లష్కరే ఉగ్రవాది సలీం పర్రే హతం
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో జనవరి 3న పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
చదవండి: దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్