WEF Gender Gap Report 2022: లింగ సమానత్వంలో భారత్‌కు 135వ ర్యాంకు
లింగ సమానత్వం విషయంలో ఐస్‌లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ 135 ర్యాంక్ లో నిలిచింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను జూలై 13న విడుదల చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది.
Also read: WEF Global Gender Gap Report 2021: మహిళా సాధికారత 135.6ఏళ్లు దూరం