Skip to main content

Crude Oil Strategic Storage: దేశంలో తొలి వాణిజ్య క్రూడాయిల్‌ స్టోరేజీ.. ఎక్క‌డండే..

క్రూడాయిల్‌ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడిచమురు స్టోరేజీ యూనిట్‌ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
India to Build First Commercial Crude Oil Strategic Storage   Indian Strategic Petroleum Reserve

కర్ణాటకలోని పాడూర్‌లో 2.5 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడిచమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు (పాడూర్‌ 2) ఇండియన్‌ స్ట్రాటెజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌ (ఐఎస్పీఆర్‌ఎల్‌) బిడ్లను ఆహ్వానించింది.

బిడ్ల దాఖలుకు ఏప్రిల్‌ 22 ఆఖరు తేదీ కాగా, జూన్‌ 27 నాటికి ప్రాజెక్టును కేటాయిస్తారు. దీనికి సంబంధించిన టెండర్‌ డాక్యుమెంట్ల ప్రకారం ఇది ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ పార్టీలు స్టోరేజీని డిజైన్‌ చేయడం, నిర్మించడం, ఫైనాన్స్‌ చేయడం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పాడూర్‌–2 స్టోరేజీని ఆపరేటరు ఏ ఆయిల్‌ కంపెనీకైనా లీజుకివ్వచ్చు. అందులో చమురుని నిల్వ చేసుకునే కంపెనీలు దాన్ని దేశీ రిఫైనర్లకు విక్రయించుకోవచ్చు.

Financial Year: ఏప్రిల్ 1 నుంచే ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. ఎందుకో తెలుసా..?

అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం నిల్వలను ముందుగా ఉపయోగించుకునేందుకు భారత ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఐఎస్‌పీఆర్‌ఎల్‌ తొలి దశలో విశాఖపట్నంతో పాటు మంగళూరు, పాడూర్‌లో 5.33 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో వ్యూహాత్మక స్టోరేజీ యూనిట్లను ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసింది. రెండో దశలో భాగంగా అండర్‌గ్రౌండ్‌లో రూ.5,514 కోట్ల వ్యయంతో వాణిజ్య, వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజీ యూనిట్‌ను ప్రతిపాదిస్తోంది.

Retail brands: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం.. రిటైల్‌ బ్రాండ్లకు కొత్త అవకాశాలు

Published date : 04 Apr 2024 06:00PM

Photo Stories