RGIA: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ?
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ నిర్వహణ హక్కులను మరో 30 ఏళ్లపాటు జీఎంఆర్ గ్రూపునకు మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. 2008 మార్చి 23న హైదరాబాద్ విమానాశ్రయం ఆరంభమైంది. ఒప్పంద నిబంధనల మేరకు 2038 మార్చి 22 వరకు నిర్వహణ హక్కులు జీఎంఆర్ గ్రూపునకు ఉన్నాయి. తాజా నిర్ణయంతో 2068 మార్చి 22 వరకు నిర్వహణ హక్కులు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్)కు లభించాయి. జీహెచ్‌ఐఏఎల్ అన్నది లిస్టెడ్ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ.
GK Awards Quiz: 'ఏ నేషన్ టు ప్రొటెక్ట్' పుస్తక రచయిత?
ఫెడ్ రేటు అరశాతం పెంపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి. గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచింది.RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం) నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ?
ఎప్పుడు : మే 05
ఎవరు : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్)
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్