Skip to main content

Logistic law: అన్ని రకాల రవాణాకు ఒకే లాజిస్టిక్‌ చట్టం: గడ్కరీ

సరుకు రవాణాకు సంబంధించి అన్ని మాధ్యమాలకు కలిపి ఒకే లాజిస్టిక్‌ చట్టాన్ని తేవడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.
Govt working on single logistic law: Gadkari
Govt working on single logistic law: Gadkari

తద్వారా పాటించాల్సిన నిబంధనలను మరింత సరళతరం చేయనుందని చెప్పారు. దేశీయంగా ఎయిర్‌ కార్గో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశీ ఎయిర్‌ కార్గో ఏజెంట్స్‌ అసోసియేషన్‌ 12వ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో లాజిస్టిక్స్‌ వ్యయాల వాటా 14 శాతంగా ఉంటోందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ పేర్కొన్నారు. దేశీ ఏవియేషన్‌ మార్కెట్లో ఎయిర్‌ కార్గో వాటా చాలా స్వల్ప స్థాయిలో ఉందని, అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. చేపలు, పండ్లు వంటి ఉత్పత్తుల రవాణాకు పాతబడిన డిఫెన్స్‌ విమానాలను ఉపయోగించవచ్చని గడ్కరీ సూచించారు. మన దగ్గర గణనీయ స్థాయిలో ఉన్న విమానాల వినియోగాన్ని తగు చర్యల ద్వారా మరింత మెరుగుపర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గగన మార్గంలో మరింత ఎక్కువగా రవాణా చేయగలిగితే లాజిస్టిక్స్‌ వ్యయాలు తగ్గగలవని తెలిపారు.   

Also read: Nitin Gadkari: 8 సీటర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Aug 2022 06:04PM

Photo Stories