Federal Reserve: ఆరోసారి వడ్డీ 0.75 శాతం పెంపు
Sakshi Education
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది.
తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెపె్టంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది.
Also read: ITR : అందరికీ ఒక్కటే ఐటీఆర్ ఫామ్
Published date : 03 Nov 2022 03:20PM