Skip to main content

ESCAP, ADB: ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థలు?

ESCAP, ADB Report

వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే రక్షణాత్మక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నటికీ మంచిది కాదని, దీనివల్ల సానుకూల ఫలితాలు ఎప్పుడూ కనబడలేదని ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్‌ వ్యవహారాల ఎకనమిక్‌అండ్‌ సోషల్‌ కమిషన్‌ (ఈఎస్‌సీఏపీ), ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) పేర్కొన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య విధానాలతోనే ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. ఈ మేరకు ‘ఆసియా– పసిఫిక్‌ ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ 2021’ శీర్షికన ఒక నివేదికను ఆవిష్కరించాయి.

టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలు

టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలను మాత్రమే అనుమతించారు.


చ‌ద‌వండి: యూనికార్న్‌ హోదా పొందిన క్రిప్టో ఎక్స్ఛేంజీ నిర్వాహక స్టార్టప్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియా– పసిఫిక్‌ ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ 2021 విడుదల
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్‌ వ్యవహారాల ఎకనమిక్‌అండ్‌ సోషల్‌ కమిషన్‌ (ఈఎస్‌సీఏపీ), ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)
ఎందుకు  : వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే, అనుసరించాల్సిన విధానాలను గురించి వివరించేందుకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

 

Published date : 07 Oct 2021 07:09PM

Photo Stories