Unicorn Company: యూనికార్న్ హోదా పొందిన క్రిప్టో ఎక్స్ఛేంజీ నిర్వాహక స్టార్టప్?
క్రిప్టో ఎక్స్ఛేంజీ నిర్వాహక స్టార్టప్ కాయిన్‌స్విచ్ కుబేర్ యూనికార్న్‌గా అవతరించింది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లను తాకడంతో ఈ హోదాను పొందింది. పలు సంస్థల నుంచి తాజాగా 26 కోట్ల డాలర్లు(రూ. 1,943 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 1.9 బిలియన్ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు బలపడింది. వెరసి క్రిప్టో ఎక్సే్ఛంజీ సంస్థలలో రెండో యూనికార్న్‌గా నిలిచింది. ఇంతక్రితం కాయిన్‌డీసీఎక్స్ సైతం బిలియన్ డాలర్ల విలువను అందుకున్న సంగతి తెలిసిందే.
లిషియస్ సైతం..
తాజా మాంసం, సీఫుడ్ బ్రాండ్ ఆన్‌లైన్ విక్రయాల స్టార్టప్ లిషియస్ సైతం యూనికార్న్ హోదాను పొందింది. 5.2 కోట్ల డాలర్లు(రూ. 389 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ తాజాగా బిలియన్ డాలర్లకు(రూ. 7,473 కోట్లు) చేరింది. డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) విభాగంలో తొలి స్టార్టప్‌గా ఈ హోదాను సాధించింది.
చదవండి: డిజిసాక్షం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనికార్న్ హోదా పొందిన క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్?
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : కాయిన్‌స్విచ్ కుబేర్
ఎక్కడ : భారత్
ఎందుకు : తాజాగా కంపెనీ విలువ 1.9 బిలియన్ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు చేరండంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
డౌన్‌లోడ్ వయా ఆపిల్ ఐ స్టోర్