Skip to main content

Elon Musk: భారత్‌లో ఏర్పాటైన స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ పేరు?

SpaceX

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీపీఎల్‌) పేరిట న్యూఢిల్లీలో దీన్ని నెలకొల్పినట్లు నవంబర్‌ 1న స్టార్‌లింక్‌ కంట్రీ డైరెక్టర్‌ (ఇండియా) సంజయ్‌ భార్గవ తెలిపారు.

ఇండియన్‌ ఆయిల్‌ మలీక్‌ అన్‌హైడ్రైడ్‌ ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటుకానుంది?

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్‌ అన్‌హైడ్రైడ్‌ ప్లాంట్‌ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్‌ రెసిన్స్, సర్ఫేస్‌ కోటింగ్స్‌ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్‌ అడిటివ్స్‌ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్‌ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్‌ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది.
 

చ‌ద‌వండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ ఎప్పటి వరకు కొనసాగనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీపీఎల్‌) పేరుతో అనబంధ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : స్పేస్‌ఎక్స్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : భారత్‌లో స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Nov 2021 03:35PM

Photo Stories