Skip to main content

Reserve Bank of India: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ ఎప్పటి వరకు కొనసాగనున్నారు?

Shaktikanta Das

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు(డిసెంబర్, 2024 వరకు) కొనసాగనున్నారు. ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మిక రాజీనామా అనంతరం 2018 డిసెంబర్‌ 12వ తేదీన ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం 2021, డిసెంబర్‌ 10వ తేదీతో పూర్తవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకపు వ్యవహారాల కమిటీ దాస్‌ పదవీకాలాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో ఆయన డిసెంబర్‌ 2024 వరకూ బాధ్యతల్లో కొనసాగుతారు.

ఒడిశా నుంచి మొదటి వ్యక్తి...

1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌ ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 2008లో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ పదవిని చేపట్టారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. తదనంతం ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి... ఒడిశా నుంచి ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
 

చ‌ద‌వండి: 2021 ఫిలాంత్రోపీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంపన్నుడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పదవీకాలం(డిసెంబర్, 2024 వరకు) పొడిగింపు 
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకపు వ్యవహారాల కమిటీ 
ఎందుకు : శక్తికాంత దాస్‌ పదవీకాలం 2021, డిసెంబర్‌ 10వ తేదీతో యుగియనున్న నేపథ్యంలో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 03:10PM

Photo Stories