The Wealth Report 2023: దేశంలో తగ్గిన అత్యంత సంపన్నులు..!
అయితే రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 19,119 పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ తెలిపారు. ఇదే జరిగితే పెరుగుదల పరిమాణం 58.4 శాతమన్నమాట. ‘‘ది వెల్త్ రిపోర్ట్ 2023’’ శీర్షికన ఆయా అంశాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తాజా నివేదిక తెలిపిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే..
☛ భారత్ బిలియనీర్లు 2021లో 145 ఉంటే, 2022నాటికి 161కి పెరిగింది. 2027 నాటికి 195 మందికి ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా.
☛ దేశంలో మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగిన సంపన్నుల జనాభా 2021లో 7,63,674 ఉంటే, 2022లో 7,97,714కి పెరిగింది. 2027 నాటికి ఈ జనాభా 16,57,272కు చేరుతుందని అంచనా..
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
☛ భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2022లో అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో మాత్రం 9.3 శాతం పెరిగింది.
☛ ఆర్థిక మందగమనాలు, తరచుగా రుణ రేట్ల పెంపుదల, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అత్యంత సంపన్నుల సంపద, పెట్టుబడి పోర్ట్ఫోలియో ప్రభావితమవుతోంది.
☛ భారత్ విషయానికి వస్తే, వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయిపై డాలర్ బలోపేతం వంటి అంశాలు వ్యక్తుల నెట్వర్త్ పెరుగుదలపై ప్రభావితం చూపిస్తోంది.
Mahila Samman Scheme: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై టీడీఎస్ లేదు