National Statistical Office: 2022 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2022, జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఫిబ్రవరి 14న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది(6.01 శాతం) ఎక్కువ. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం నమోదైంది.
ఆర్‌బీఐ అంచానాలు ఇలా..
రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఇటీవల అంచనా వేసింది. కాగా, డిసెంబర్ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది.
చదవండి: ప్రస్తుతం ఆర్‌బీఐ రివర్స్ రెపో ఎంత శాతంగా ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2022, జనవరిలో 6.01 శాతంగా నమోదైంది.
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)
ఎక్కడ : భారత్
ఎందుకు : ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్