Skip to main content

Andhra Pradesh Development: ఎన్ని సవాళ్లు ఉన్నా ఏపీ టాప్!

ఆంధ్రప్రదేశ్‌ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతో పోలిస్తే అభివృద్ధి చెందింది.
 Andhra Pradesh Surpasses Previous Records  Andhra Pradesh's Economic Growth  Andhra Pradesh Development In Different Aspects   Andhra Pradesh Education

కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా.. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో రంగాల్లో ముందుంది.

► రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి రాష్ట్రం.
► సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది.
► 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ.

Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు తలరాత.. ఏపీలో విదేశీ విద్యా దీవెన.. దాదాపు కొన్ని వంద‌ల‌ కోట్లు జ‌మ‌..!


► 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది.
దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 
► 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది.
► కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. 

► టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్‌ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది.
► ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు.
► తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్ర​స్తుతం 9వ స్థానానికి ఎదిగింది.

► చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉ‍న్నాయి.
► వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్‌ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు.

Credit Cards: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. ఒకరికి ఎన్ని కార్డులుండాలి.. కార్డ్ తీసుకునే ముందు ఏం చూడాలో తెలుసా..?

Published date : 21 Dec 2023 11:06AM

Photo Stories