Saheli Program: నాలుగు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం ఈ–కామర్స్ సంస్థ?
మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించే దిశగా అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద నాలుగు ప్రభుత్వ సంస్థలతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తెలిపింది. జార్ఖండ్ స్టేట్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (జెఎస్‌ఎల్‌పీఎస్), ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్ (యూపీఎస్‌ఆర్‌ఎల్‌ఎం), ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ (సీజీ ఫారెస్ట్) అస్సామ్ రూరల్ ఇన్‌ఫ్రా అండ్ అగ్రి సర్వీసెస్ (ఏఆర్‌ఐఏఎస్)లతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు నవంబర్ 19న తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో సదరు సంస్థల పరిధిలోని మహిళా వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను అమెజాన్ ఇండియాలో నమోదు చేసుకునేందుకు, మరింత విస్తృతంగా మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయని పేర్కొంది.
ఉమెన్స్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డే ఎప్పుడు?
ఉత్పత్తుల లిస్టింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్ తదితర అంశాలకు సంబంధించి మహిళలు అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద శిక్షణ కల్పిస్తామని అమెజాన్ తెలిపింది. ఉమెన్స్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డే(నవంబర్ 19) సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టోర్ ఆవిష్కరించినట్లు వివరించింది.
చదవండి: ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సులు పొందుతున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాలుగు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా
ఎందుకు : అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్